బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!
కరోనా లాంటి మహమ్మారి వచ్చిన తర్వాత మనిషిలో శుభ్రత అనేది చాలా ముఖ్యమైంది. కచ్చితంగా పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేవరకు మనిషి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.;
కరోనా లాంటి మహమ్మారి వచ్చిన తర్వాత మనిషిలో శుభ్రత అనేది చాలా ముఖ్యమైంది. కచ్చితంగా పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేవరకు మనిషి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులతో పోరాడుతున్నప్పుడు శుభ్రతలో టూత్ బ్రష్ అనేది కూడా చాలా ముఖ్యమే.. నోరు, దంతాలను శుభ్రంగా ఉంచడం ద్వారా చాలా వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు.. అయితే చాలా మంది బ్రష్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటి వలన దంతాలు, చిగుళ్ళ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేకపోలేదు.
♦ వేగంగా బ్రష్ చేయడం తగ్గించాలి. దీనివలన ఎనామిల్ దెబ్బతింటుంది. కాలక్రమేణా చిగుళ్ళను దెబ్బతీస్తుంది.
♦ ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా టూత్ బ్రష్ మార్చాలి.
♦ 2 నుంచి 3 నిమిషాలు బ్రష్ చేయడం మంచిది. ఎక్కువసేపు బ్రష్ చేయడం ద్వారా పళ్లు దెబ్బతినే అవకాశం ఉంది.
♦ రోజు రెండుసార్లు బ్రష్ చేస్తే సరిపోతుంది. పొద్దున, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేస్తే సరిపోతుంది.
♦ దంతాల లోపలి భాగాన్ని శుభ్రపరిచేలా చూసుకోండి. ఎందుకంటే అక్కడ సూక్ష్మక్రిములు ఉండవచ్చు.
♦ గట్టిగా బ్రష్ చేయడం మానేయండి.. దీనివలన మీ దంతాల పైన ప్రభావం పడే అవకాశం ఉంది.
♦ మీరు బ్రష్ చేయడం పూర్తయిన తర్వాత మీ టూత్ బ్రష్ నిటారుగా ఉంచండి.. !