Hair Fall Control Mask: జుట్టు రాలకుండా ఉండేందుకు నేచురల్ మాస్క్.. ఇంట్లోనే ఈజీగా..

Hair Fall Control Mask: అమ్మమ్మ, నానమ్మల కాలంలో ఈ షాంపులు లేవు, ఈ జుట్టు రాలడాలు లేవు.. సహజంగా దొరికే వాటితోనే వాళ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేవారు.. మందరాకులు, కుంకుడు కాయలు తలస్నానానికి ఉపయోగించేవారు.

Update: 2022-06-17 08:39 GMT

Hair Fall Control Mask: అమ్మమ్మ, నానమ్మల కాలంలో ఈ షాంపులు లేవు, ఈ జుట్టు రాలడాలు లేవు.. సహజంగా దొరికే వాటితోనే వాళ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేవారు.. మందరాకులు, కుంకుడు కాయలు తలస్నానానికి ఉపయోగించేవారు. ఇప్పుడు మార్కెట్లో దొరికే ఎంత ఖరీదైన షాంపూలు వాడినా జుట్టు రాలిపోతోంది. మంచి ఆహారంతో పాటు జీవన శైలి కూడా జుట్టుని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది.

నేచురల్ ఉత్పత్తుల ద్వారా షాంపూ తయారు చేసుకునే విధానాన్ని వివరిస్తున్నారు నిపుణులు..

కావలసినవి..

1. మేతి

2. ఉసిరి

3. శీకాకాయ్

4. మందార పువ్వులు

5. వేప ఆకులు

6. కరివేపాకు

7. గులాబీ రేకులు

తయారు చేయడం:

మొత్తం ఈ ఏడు వస్తువులను ఒకే పరిమాణంలో తీసుకోవాలి. వాటిని ఎండబెట్టి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని రెండు చెంచాల గోరువెచ్చని నీటిలో బాగా కలిపి రాత్రంతా నానబెట్టి ఉంచాలి. మర్నాడు ఉదయం నూనె రాసుకున్న జుట్టుకు అప్లై చేసి హెర్బల్ షాంపూతో కడగాలి.

మూడు నెలల పాటు వారానికి ఒకసారి మీ జుట్టు కుదుళ్లకు అప్లై చేయడం ద్వారా వెంట్రుకలు రాలడాన్ని నివారించవచ్చు. దీంతో పాటు ఇంట్లో తయారు చేసుకున్న షాంపు, నూనెలను తయారు చేసుకుని వాటినే జుట్టుకు పట్టించాలి.. ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. ఆకు కూరలు, ప్రోటీన్ పదార్ధాలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Tags:    

Similar News