hair fall control: జుట్టు రాలకుండా ఉండేందుకు ఇంట్లోనే ఈ విధంగా..

hair fall control: హెయిర్‌క్లిప్‌లు, రబ్బర్ బ్యాండ్‌లు వంటి జుట్టు రాలే పరికరాలను ఉపయోగించకపోవడమే మంచిది. తలస్నానం చేసిన తరువాత టైమ్ లేదని డ్రయ్యర్లు వాడుతుంటారు. అది జుట్టును పొడిబారేలా చేస్తుంది.

Update: 2021-12-10 01:30 GMT

hair fall control: ఈ మధ్య కాలంలో తినే ఫుడ్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు అందరికీ జుట్టు బాగా ఊడిపోతోంది. పనిలో ఒత్తిడి, మారుతున్న జీవనశైలి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.. ఏవేవో ఆయిల్స్ ఎంత అప్లై చేసినా కుదుళ్లు బలంగా ఉంటే జుట్టు ఊడదు.. అందుకోసం తీసుకునే ఆహారంలో పోషకాలు, ప్రొటీన్లు ఉన్నాయో లేదో చూసుకోవాలి. జుట్టుకు సరైన సంరక్షణ ఇస్తే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

జుట్టు పెరుగుదల వ్యక్తి యొక్క జన్యు చరిత్ర మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆహారంలో మార్పు చేసుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. దీనికి సంబంధించి తగిన చికిత్సల గురించి వైద్యుని సంప్రదించడం ఉత్తమం.

కొన్ని ఇంటి నివారణలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి..

జుట్టు పెరిగేందుకు ప్రొటీన్ తోడ్పడుతుంది. ప్రొటీన్ లోపం వల్ల జుట్టు రాలిపోవచ్చు. ఆరోగ్యకరమైన ప్రొటీన్ బీన్స్, గుడ్లు, చేప, గింజ ధాన్యాలు, విత్తనాలు, మాంసం వంటి వాటిలో ఉంటుంది. ఇనుము కూడా ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి. పప్పు ధాన్యాలు, గుమ్మడి గింజలు, పాలకూర, తెల్ల బీన్స్‌లో ఎక్కువగా ఉంటుంది.

గోరు వెచ్చని నూనెతో మర్దనా చేయడం ద్వారా జుట్టు కుదుల్లు బలంగా తయారవుతాయి. కొబ్బరి నూనెకు కొన్ని చుక్కలు లావెండర్ లేదా రోజ్మెరీ ఆయిల్ కలిపి మర్దనా చేస్తే శరీరంలోని అలసట కూడా దూరమవుతుంది. ఇది జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది.

జపనీస్ అధ్యయనం ప్రకారం రోజుకు 4 నిమిషాలు తలకు మసాజ్ చేయించుకున్న పురుషులకు 6 నెలల తర్వాత ఒత్తైన జుట్టు పెరగడాన్ని గుర్తించారు. స్కాల్ప్ మసాజ్ చేసే పరికరాలు కూడా మందుల దుకాణాల్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని ఉపయోగించడం ద్వారా ఫలితం పొందవచ్చు.

పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. హెయిర్‌క్లిప్‌లు, రబ్బర్ బ్యాండ్‌లు వంటి జుట్టు రాలే పరికరాలను ఉపయోగించకపోవడమే మంచిది. తలస్నానం చేసిన తరువాత టైమ్ లేదని డ్రయ్యర్లు వాడుతుంటారు. అది జుట్టును పొడిబారేలా చేస్తుంది.

జుట్టు ఎక్కువగా రాలుతున్నప్పుడు చర్మవ్యాధుల నిపుణుడిని సంప్రదించాలి. జుట్టు రాలడానికి గల కారణాలు తెలుసుకుని చికిత్స అందిస్తారు. 

Tags:    

Similar News