Rice Water: బియ్యం నీరు లేదా గంజితో ఎన్ని ఉపయోగాలో.. జుట్టు ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి..

Rice Water: కొన్ని శతాబ్ధాలుగా బియ్యం నీటిని అందమైన చర్మం కోసం, ఆరోగ్యమైన జుట్టు కోసం ఉపయోగిస్తున్నారు. పులియబెట్టిన బియ్యం నీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి.

Update: 2022-11-11 06:58 GMT

Rice Water: కొన్ని శతాబ్ధాలుగా బియ్యం నీటిని అందమైన చర్మం కోసం, ఆరోగ్యమైన జుట్టు కోసం ఉపయోగిస్తున్నారు. పులియబెట్టిన బియ్యం నీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. నేడు అందుబాటులో అనేక రకాల సౌందర్య సాధనాలు ఉన్నా చాలా మంది ప్రకృతి సిద్ధంగా లభించే ఉత్పత్తులను వాడడానికే సిద్ధపడుతున్నారు. మంచి చర్మం మరియు జుట్టు కావాలంటే, ఈ సింపుల్, నేచురల్ హోం రెమెడీని ఒకసారి ప్రయత్నించండి.



రైస్ వాటర్ అంటే ఏమిటి?


ఇది బియ్యాన్ని నానబెట్టిన లేదా ఉడకబెట్టిన తర్వాత మిగిలిన నీరు. ఈ తెల్లటి ద్రవం కొన్ని శక్తివంతమైన విటమిన్లు మరియు ఖనిజాల స్టోర్‌హౌస్. ఇవి మీ చర్మం మరియు జుట్టుకు అద్భుతమైన పోషణను అందిస్తాయి. ఈ పురాతన పద్ధతిని చైనా, జపాన్, ఆగ్నేయాసియాలోని మహిళలు తమ జుట్టు ఆరోగ్యం కోసం ఉపయోగిస్తారు. దక్షిణ మధ్య చైనాలో ఉన్న హువాంగ్లువో అనే చిన్న గ్రామం "ప్రపంచంలోని అతి పొడవైన జుట్టు గ్రామం"గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను కలిగి ఉంది. ఎందుకంటే ఆ గ్రామానికి చెందిన ప్రతి మహిళ సగటు జుట్టు పొడవు 1.5 మీటర్లకు పైగా ఉంటుంది. యుక్త వయసు ఉన్న మహిళలే కాదు డెబ్బైల వయస్సులో ఉన్న వృద్ధ మహిళలకు కూడా నల్లటి జుట్టుతో మెరిసిపోతారు. వారి రహస్యం? బియ్యం నీరు.


రైస్ వాటర్ ఎలా తయారు చేయాలి?


పులియబెట్టిన బియ్యం నీటిలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. హువాంగ్లువో గ్రామానికి చెందిన మహిళలు పులియబెట్టిన నీటిని (బియ్యాన్ని కడిగిన తర్వాత మీకు లభించేది) షాంపూగా ఉపయోగిస్తారు. అందులో కొన్ని టీ గింజలు, అల్లం వంటి కొన్ని ఇతర సహజ పదార్ధాలను మిళితం చేసి జుట్టుకు షాంపూగా ఉపయోగిస్తారు.


దీని తయారీ విధానం..

మొదట అరకప్పు బియ్యాన్ని నీటిలో సుమారు 15-30 నిమిషాలు నానబెట్టండి. సమయం లేకపోతే బియ్యాన్ని రాత్రి పూట నానబెట్టుకోవచ్చు. ఆ తరువాత ఆ నీటిని వడకట్టండి. మీకు దాని వాసన ఇబ్బందిగా ఉంటే రోజ్మేరీ లేదా లావెండర్ ఆయిల్ రెండు చుక్కలను జోడించండి. ఆ నీటిని తాగడం వలన జుట్టుకు కావలసిన పోషకాలు అందుతాయి. చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.



రెండవది, మీరు బియ్యం ఉడకబెట్టడం ద్వారా తయారు చేయవచ్చు. అన్నం కుక్కర్‌లో కాకుండా విడిగా వండాలి. బియ్యం ముప్పావు వంతు ఉడికిన తరువాత వార్చాలి. వార్చిన ఆ నీరు మిల్కీ వైట్ కలర్‌లో ఉంటుంది. ఇందులో అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి, నీరు చల్లబడిన తర్వాత జుట్టుకి అప్లై చేయాలి. చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ఆరోగ్యం కూడా.

మూడవది.. మీరు హువాంగ్లూలోని స్త్రీల మాదిరిగా బియ్యం నీటిని తయారు చేయవచ్చు. నీటిలో అర కప్పు బియ్యం వేసి, ఆపై అల్లం ముక్కలు, టీ గింజలు వేసి ఈ మిశ్రమాన్ని సిరామిక్ లేదా మట్టి పాత్రలో పోయాలి. మూత పెట్టి గది ఉష్ణోగ్రత వద్ద సుమారు 10 రోజులు పులియబెట్టాలి. దీనిని షాంపూగా ఉపయోగించవచ్చు. దీనిని జుట్టుకు అప్లై చేసి 10-15 నిమిషాలు ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

మొదటి రెండు చర్మం మరియు జుట్టు రెండింటిలోనూ ఉపయోగించవచ్చు, మూడవది ఖచ్చితంగా జుట్టు కోసం ఉపయోగించాలి.


రైస్ వాటర్‌లో అనేక విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఫెరులిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంట్ కూడా. ఈ మ్యాజిక్ వాటర్‌ స్కిన్ క్లెన్సర్‌గా, మొటిమల చికిత్సకు కూడా ఉపయోగించవచ్చు. బియ్యం నీటిలో ముంచిన పెద్ద వస్త్రాన్ని మీ ముఖంపై వేసుకుని ఓ పది పదిహేను నిమిషాలు ఉంచి కడిగితే మంచి ఫలితం ఉంటుంది. 

Tags:    

Similar News