Soft Drinks: సాప్ట్ డ్రింక్స్ తాగుతున్నారా.. వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే..

Soft Drinks: దాహం వేస్తే డైట్ కోక్ తాగుతుంటారు చాలా మంది.. కానీ దాని వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే చచ్చినా ముట్టుకోరు.

Update: 2022-08-18 07:30 GMT

Soft Drinks: దాహం వేస్తే డైట్ కోక్ తాగుతుంటారు చాలా మంది.. కానీ దాని వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే చచ్చినా ముట్టుకోరు. కోక్ సంబంధిత సాప్ట్ డ్రింక్స్‌లో చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. దీంతో అనేకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

డైట్ కోక్.. పేరులో డైట్ ఉంది కదా అని ఇదేదో డైట్‌ని కంట్రోల్ చేయడానికి తయారు చేశారని పొరబడితే కోక్‌లో కాలేసినట్లే. ఆరోగ్యంపై ప్రభావం చూపే డైట్ కోక్‌ని దూరంగా పెడితే మంచిది.

మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది: శరీరం నుండి హానికరమైన టాక్సిన్‌లను తొలగించి రక్తాన్ని శుభ్రపరచడంలో మూత్రపిండాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. డైట్ కోక్, ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే, కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీ సమస్యలకు కారణం కావచ్చు. మీరు ఒక రోజులో రెండు కంటే ఎక్కువ డైట్ కోక్ క్యాన్లను తాగితే, మీ మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.

బరువును పెంచుతుంది: డైట్ కోక్‌లో 'డైట్' అనే పదం ఉన్నందున అందులో కేలరీలు లేవని మీరు భావించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం డైట్ సోడా తీసుకోని వారి కంటే తరచుగా డైట్ సోడా తీసుకునే వారు బరువు పెరుగుతారు.

దంతాలకు హానికరం: డైట్ కోక్ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి, ఇది పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. దంతాలకు హాని కలిగిస్తుంది. మీరు డైట్ కోక్ ఎంత ఎక్కువగా తీసుకుంటే, మీరు దంత సమస్యలతో అంతగా బాధపడే అవకాశం ఉంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది: మరొక ప్రధాన డైట్ కోక్ సైడ్ ఎఫెక్ట్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం. సాధారణ LDL కొలెస్ట్రాల్ స్థాయిల కంటే ఎక్కువగా ఉండటం వల్ల స్ట్రోక్ మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

దాహం తీరదు: మీకు దాహం వేస్తే, డైట్ కోక్ మీ ఎంపిక కాకూడదు. ఇందులో కెఫిన్ ఉంటుంది. మీరు డైట్ కోక్ కంటే సాధారణ నీరు లేదా కోకోనట్ వాటర్, హెర్బల్ టీ వంటివి తీసుకోవడం ఉత్తమం. 

Tags:    

Similar News