నిమ్మరసం ఎక్కువగా తాగితే ఎదుర్కొనే సమస్యలు ఇవే..!
అతి ఏదైనా ప్రమాదమే.. అలాగే నిమ్మరసం కూడా.. వేడి చేసినప్పుడు, ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు కచ్చితంగా నిమ్మరసం తీసుకుంటూ ఉంటారు;
అతి ఏదైనా ప్రమాదమే.. అలాగే నిమ్మరసం కూడా.. వేడి చేసినప్పుడు, ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు కచ్చితంగా నిమ్మరసం తీసుకుంటూ ఉంటారు. అంతెందుకు దీక్ష విరమణ చేసిన వాళ్లకు ఎక్కువగా నిమ్మరసం ఇస్తుంటారు. చాలా మంది కాలంతో సంబంధం లేకుండా నిమ్మరసం రెగ్యులర్‌గా తాగుతుంటారు. అయితే నిమ్మరసం ఎక్కువైతే కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు.. దీనికి వలన పలు సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుందని అంటున్నారు.
♦ నిమ్మరసం ఎక్కువగా తాగితే ముందుగా దంతాలు దెబ్బతింటాయి. లెమన్ వాటర్‌లో ఎసిడిక్ యాసిడ్ ఉంటుంది. అది ముందుగా దంతాలపైన ప్రభావం చూపిస్తుంది.
♦ నిమ్మరసం ఎక్కువైతే... అల్సర్లు, ACDT సమస్యలు, కడుపునొప్పి వస్తాయి. దీనితో పొట్టలో వేడి, వికారం, వామ్టింగ్స్ వస్తున్నట్లు అవుతుంది.
♦ vనిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రాశయం అధికంగా పనిచేయాల్సి వస్తుంది. దీనితో దానిపై అధిక ఒత్తిడి పడి మూత్రాశయ వ్యాధులు వస్తాయి.
♦ నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వలన దంతాల పైనే కాదు... చిగుళ్లగు కూడా ప్రమాదమే.. నిమ్మరసం ఎక్కువగా తాగితే కూడా చిగుళ్లు పాడైపోతాయి.
♦ కొంతమందికి నిమ్మరసం తాగితే తలనొప్పి కూడా వస్తుంది.