చాక్లెట్ ప్రియులకు శుభవార్త.. వైట్ చాక్లెట్‌తో వెయిట్ కంట్రోల్..
Chocolate Helps Burn Fat: చాక్లెట్ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వార్త. వైట్ చాక్లెట్ తింటే వెయిట్ తగ్గుతారట;
Chocolate Burns Fat
Chocolate Helps Burn Fat: చాక్లెట్ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వార్త. వైట్ చాక్లెట్ తింటే వెయిట్ తగ్గుతారట.. మరికేం రోజుకొకటి లాగించేయొచ్చు కదా. తాజా అధ్యయనం ప్రకారం వైట్ చాక్లెట్లు శరీర కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి వైట్ చాక్లెట్ కూడా సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్ బరువు తగ్గడానికి సహాయపడుతుందని మనందరికీ తెలుసు. డార్క్ చాక్లెట్ ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండాలనే కోరికలను తగ్గిస్తుంది. ఆకలిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి. పాలతో తయారయ్యే చాక్లెట్లు కూడా శరీర కొవ్వును కరిగించడానికి సహాయపడతాయని మీకు తెలుసా? అది నిజమే! మిల్క్ చాక్లెట్ తినడం వలన బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుందని తాజా అధ్యయనం కనుగొంది. అంతేకాకుండా, రుతుక్రమం ఆగిపోయిన మహిళలపై నిర్వహించిన అధ్యయనం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నిర్వహించడానికి సహాయపడుతుందని కనుగొన్నారు.
ఈ అధ్యయనాన్ని బ్రిఘం పరిశోధకులు మరియు స్పెయిన్‌లోని ముర్సియా విశ్వవిద్యాలయం నిపుణులు సంయుక్తంగా నిర్వహించారు. ఉదయం లేదా రాత్రి 100 గ్రాముల చాక్లెట్ తిన్న వారిపై పరిశోధన తరువాత, నిపుణులు ఆసక్తికరమైన విషయాలతో ముందుకు వచ్చారు. అవేంటో ఒకసారి చూద్దాం..
*బరువు తగ్గడం: కొవ్వును కరిగించడానికి వైట్ చాక్లెట్ సహాయపడుతుంది.
*ఉదయం లేదా సాయంత్రం చాక్లెట్ తినడం ఆకలి, నిద్రలపై ప్రభావితం చేస్తుంది.
*రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది.
పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిశీలిస్తే, బరువు తగ్గించే ఆహారంలో వైట్ చాక్లెట్ ఉండడం ఆనందించదగ్గ పరిణామం. కానీ ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మీ ఆహారంలో కొత్తగా ఏదైనా చేర్చే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం.