కర్ణాటకలో ఆప్ ఒక్క సీటుకూడా గెలవదు : శివకుమార్

Update: 2023-03-29 12:21 GMT

ఆప్ కర్ణాటకలో ఒక్క సీటుకూడా గెలవదని అన్నారు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్. రానున్న ఎన్నికలలో కర్ణాటకలోని మొత్తం 224స్థానాల్లో ఆప్ పోటీచేస్తుందని ఆపార్టీ చీఫ్ కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. "వారిని రానివ్వండి. నేను వారిని స్వాగతిస్తున్నాను. వారు ఒక్క సీటును కూడా గెలవరు" అని శివకుమార్ అన్నారు. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటక రాజకీయాల్లోకి ప్రవేశించనుంది. మే 10న ఎన్నికలు జరుగనుండగా 13న ఫలితాలు వెలువరిస్తామని ఈసీ తెలిపింది.

మొత్తం 224 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను పోటీకి దించనున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఫలితాలు బాగుంటాయని కేజ్రీవాల్ తెలిపారు. AAP రాబోయే ఎన్నికల కోసం 80 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత ఈ ప్రకటన చేసింది. తొలి జాబితాలో చిక్‌పేట నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కాళప్ప ఆప్ తరపున పోటీ చేయనున్నారు, మాజీ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అధికారి కే మథాయ్ (శాంతి నగర్), బీటీ నాగన్న (రాజాజీనగర్), మోహన్ దాసరి (సీవీ రామన్ నగర్), శాంతల దామ్లే (మహాలక్ష్మి) పద్మనాభనగర్ నుండి అజయ్ గౌడ పోటీచేయనున్నారు.

Similar News