కరోనా టెన్షన్.. జెఈఈ పరీక్షలకు 26 శాతం మంది విద్యార్థులు గైర్హాజరు

కోవిడ్ వ్యాప్తి, లాక్డౌన్ నిబంధనలు.. రవాణాలో ఇబ్బందులు.. విద్యార్థులు పరీక్షలు వాయిదా వేయాలని కోర్టుకు వెళ్లారు.

Update: 2020-09-10 10:09 GMT

పరీక్షలు జరపాలి అని ఒకవర్గం.. వద్దు అని ఒక వర్గం.. ఎట్టకేలకు గత వారం నిర్వహించిన జేఈఈ పరీక్షలకు మొత్తం 8.58 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 6.35 లక్షల మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలకు హాజరైనట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ట్విట్టర్ లో వెల్లడిచేశారు.

కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, స్థానికంగా లాక్డౌన్ నిబంధనలు నెలకొన్న కారణంగా రవాణాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యార్థులు పరీక్షలు వాయిదా వేయాలని కోర్టుకు వెళ్లారు. గత ఏడాది 94 శాతం పైగా విద్యార్థులు పరీక్ష రాస్తే.. ఈ ఏడాది 74 శాతం మంది మాత్రమే హాజరయ్యారు.

Tags:    

Similar News