success story: మలబార్ పరోటా తయారు చేస్తూ.. 18 మందికి ఉపాధి కల్పిస్తూ..

success story: మహమ్మారి చాలా ఉపాధి అవకాశాలను పోగొట్టింది. కొంత మందికి కొత్త అవకాశాలను వెతికిపెట్టింది.

Update: 2023-03-30 07:25 GMT

Success Story: మహమ్మారి చాలా ఉపాధి అవకాశాలను పోగొట్టింది. కొంత మందికి కొత్త అవకాశాలను వెతికిపెట్టింది. అలా సక్సెస్ అయిన వారిలో 32 ఏళ్ల దాస్ కూడా ఒకడు. ఒకప్పుడు ఎవరికీ తెలియని ఆహారాన్ని ఇప్పుడు అందరికీ పరిచయం చేశాడు. ఎగువ అస్సాం నివాసితులకు ప్రతిరోజూ ప్యాక్ చేసిన పరోటాలను విక్రయిస్తున్నాడు. 18 ఏళ్ళ వయసులో, రాష్ట్రంలోని చాలా మంది యువకుల మాదిరిగానే, దిగంత దాస్ అస్సాంలోని తన ఇంటిని, కుటుంబసభ్యులను వదిలి బెంగుళూరు వెళ్లాడు పని కోసం. దక్షిణ భారతదేశంలో ఒక దశాబ్దానికి పైగా పనిచేసినప్పటికీ, మహమ్మారి కారణంగా అతడి జేబులో ఒక్క పైసా లేకుండా పోయింది. దాంతో ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. ఖాళీగా కూర్చుంటే జీవితం ఎలా గడుస్తుందని ఆలోచించాడు.. మలబార్ పరోటాను తయారుచేయడంలో మంచి పరిజ్ఞానం ఉంది. దాన్నే ఉపాధిగా మలుచుకోవాలనుకున్నాడు దాస్.

సంవత్సరాలుగా, అతను అనేక నగరాల్లో అనేక ఉద్యోగాలు చేశాడు. హోటళ్లలో గదులు శుభ్రం చేశాడు.. ముంబైలో సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. నిర్మాణ సంస్థలో పెయింటింగ్ పనులు చేసేవాడు, కొబ్బరి పొట్ట తయారీ కర్మాగారంలో పని చేశాడు.. ఏదో ఒకపని చేస్తూ నిరంతరం బిజీగా ఉండేవాడు.. అమ్మానాన్నలకు అందులోనే కొన్ని డబ్బులు పంపేవాడు.. అయితే అప్పుడే ఒకసారి పరోటా తయారీ, ప్యాకేజింగ్ యూనిట్లలో పని చేసే అవకాశం కూడా వచ్చింది. అదే ఇప్పుడు పనికొచ్చింది. తాను కూడా సొంతంగా పరోటా తయారీ యూనిట్ ప్రారంభించాలనుకున్నాడు. ఆరు నెలల క్రితమే బిస్వనాథ్ చరియాలిలో తన సొంత యూనిట్‌ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. విజయవాడలో వ్యాపారం కొనసాగిస్తున్న అతని పాత స్నేహితుడు సూర్య థాపా అతనికి సహాయం చేశాడు. “నేను మొదటిసారిగా ఈ మార్కెట్‌లోకి ప్రవేశించినప్పుడు, పరోటా నిజంగా అందరికీ తెలిసిన ఉత్పత్తి కాదు. కానీ నా సొంత పట్టణంలో కొన్ని దుకాణాలు ఉన్నాయి, అవి నన్ను అంగీకరించి, నా ఉత్పత్తిని ఇష్టపడి, వాటిని తమ దుకాణాల్లో తీసుకెళ్లడం ప్రారంభించాయి, ”అని దాస్ చెప్పారు. 18 మంది సిబ్బందితో, దాస్ తన వ్యాపార ఖర్చులకు సరిపడా సంపాదిస్తున్నట్లు చెప్పారు. 

Tags:    

Similar News