దేశంలో కొత్తగా 3,23,144 కరోనా కేసులు.. 2,771 మంది మృతి..!

తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16 లక్షల 58 వేల 700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,23,144 కరోనా కేసులు బయటపడ్డాయి.;

Update: 2021-04-27 05:00 GMT

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. వరుసగా మరోసారి మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16 లక్షల 58 వేల 700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,23,144 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇక కరోనాతో 2,771 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,76,36,307కి చేరింది. ఇక మరణాల సంఖ్య రెండు లక్షలలకి చేరుతుంది. అటు తాజాగా కరోనా నుంచి 2,51,827 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇదిలా వుండగా నిన్న 33,59,963 మందికి కేంద్రం టీకాలను అందజేసింది. దీనితో ఆ సంఖ్య 14,52,71,186 కి చేరుకుంది.

Tags:    

Similar News