India Corona cases : మళ్ళీ 4 వేలకుపైగా మరణాలు..!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం ఆందోళనకి గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి మరణాలు 4వేలు దాటాయి.;

Update: 2021-05-12 04:45 GMT

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం ఆందోళనకి గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి మరణాలు 4వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 19,83,804 వైరస్‌ పరీక్షలు చేయగా 3,48,421 కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2.33కోట్లకు చేరింది. ఇక అటు కరోనా నుంచి 3,55,338 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 1.93కోట్ల మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,04,099 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటున్నారు. అటు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 17.52కోట్ల మందికి టీకాలు అందించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News