దేశంలో కొత్తగా 3,60,960 కరోనా కేసులు.. 3,293 మంది మృతి
తాజాగా గడిచిన 24 గంటల్లో 17,23,912 కరోనా పరీక్షలు చేయగా.. 3,60,960 కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,79,97,267కి చేరింది.;
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. రోజురోజుకూ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 17,23,912 కరోనా పరీక్షలు చేయగా.. 3,60,960 కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,79,97,267కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,293 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 2,01,187గా నమోదయ్యాయి. ఇక కరోనా నుంచి ఒక్కరోజులోనే 2,61,162మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 29,78,709 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.