India Corona Cases : దేశవ్యాప్తంగా కాస్త తగ్గిన కొత్త కరోనా కేసులు, మరణాలు

తాజాగా గడిచిన 24 గంటల్లో 14,74,606 కరోనా టెస్టులు చేయగా 3,66,161 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో 3,754 మంది ప్రాణాలు కోల్పోయారు.;

Update: 2021-05-10 05:30 GMT

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా నాలుగు రోజులు నాలుగు లక్షలకి పైగా కేసులు నమోదు కాగా.. తాజాగా గడిచిన 24 గంటల్లో 14,74,606 కరోనా టెస్టులు చేయగా 3,66,161 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో 3,754 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,26,62,575కి చేరుకుంది. అటు మరణాల సంఖ్య 2,46,116కి చేరుకుంది. అటు గడిచిన 24 గంటల్లో 3,53,818మంది డిశ్చార్జ్ అయ్యారు. 37,45,237యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 17.01కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. 

Tags:    

Similar News