Bipin Rawat: బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్‌కు పైలెట్ ఆయనే..
Bipin Rawat: తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మరణించారు.;
Bipin Rawat: తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మరణించారు. ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ ప్రమాదంలో కన్నుమూశారు. అయితే ఈ సమయంలో హెలికాప్టర్‌ను సీనియర్ వింగ్ కమాండర్ పృథ్వి సింగ్ చౌహాన్ నడుపుతున్నారు. ఆర్మీలో 109 హెలికాప్టర్ యూనిట్‌కు పృథ్వి సింగ్ చౌహాన్ కమాండింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. 14మందితో వెళ్తున్న IAF-MI-17V5 హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. ఇందులో బిపిన్ రావత్ భార్య మధులిక కూడా ఉన్నారు. హెలికాప్టర్ కూలిన ఘటనపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విచారణకు ఆదేశించింది.