Actress Attack: బాయ్ ఫ్రెండ్ చేతిలో చావు దెబ్బలు
తమిళ నటిపై బాయ్ ఫ్రెండ్ దాడి; గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి ముఖ కవళికలు;
తమిళ నటి అనికా విక్రమన్ తన ప్రియుడి చేతిలో అత్యంత దారుణంగా గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ముఖ కవళికలు పూర్తిగా మారిపోయిన స్థితి ఉన్న ఆమె ముఖం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మాజీ ప్రియుడే తనని చిత్ర హింసలకు గురిచేసినట్లు అనికా వెల్లడించింది. తనను తీవ్రంగా కొట్టి, గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. ఇంత జరిగినా తాను మౌనంగా ఉండటంతో ప్రస్తుతం తనపై, తన తల్లిదండ్రులపైనా బెదిరింపులకు సైతం దిగుతున్నాడని వాపోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని, అతడు వారిని కూడా కొనేశాడని అనికా చెబుతోంది.