Air India Urination Row: ఆ పని నేను చేయలేదు....

తోటి ప్రయాణీకురాలిపై మూత్రవిసర్జన చేసిన కేసులో కొత్త ట్విస్ట్; ఆ పని చేయలేదంటోన్న శంకర్ మిశ్రా; బాధితురాలే యూరినరీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని కొత్త వాదన.....

Update: 2023-01-13 11:19 GMT

ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో తోటి ప్రయాణీకురాలిపై మూత్రవిసర్జన చేసిన కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా తరుఫు లాయర్ తొలిసారి స్పందించారు. వృద్ధురాలు పేర్కొంటున్నట్లు మిశ్రా ఆమెపై మూత్రవిసర్జన చేయలేదని, ఆమే తనపై తాను మూత్ర విసర్జన చేసుకొన్నట్లు వెల్లడించారు. సదరు మహిళ యూరినరీ ఇన్ కంటినెన్స్(Urinary Incontinence) తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఆమె కథక్ నాట్యకారిణి అని, 80శాతం మంది కథక్ డాన్సర్లు ఇదే వ్యాధితో బాధపడుతుంటారని లాయర్ తెలిపారు. 


అంతేకాదు.. ఆమె కూర్చుకున్న సీటు వద్దకు వెళ్లడం అంత సులభం కాదని, అసలు ఎవరూ ఆమె వద్దకు వెళ్లలేదని తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే సెషన్స్ కోర్ట్ జడ్జ్ మాత్రం మిశ్రా లాయర్ కు గట్టి కౌంటరే ఇచ్చారు. ఫ్లైట్ లో ఒక మూల నుంచి మరొ మూలకు వెళ్లడం అసాథ్యమైన పనేమీ కాదని స్పష్టం చేశారు. తాను కూాడా అనేక సార్లు ఫ్లైట్ లో ప్రయాణించానని తనకూ ఆ మాత్రం అవగాహన ఉందని తెలిపారు. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.


 


Tags:    

Similar News