రైలు టిక్కెట్లు అమెజాన్‌లో బుక్ చేసుకుంటే..
రైల్వే అధికారులు ఈ-కామర్స్ కంపెనీలతో..;
అమెజాన్ పే యాప్ ద్వారా ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఐఆర్‌సీటీ, అమెజాన్ మధ్య టిక్కెట్ బుకింగ్ ఒప్పందం కుదిరింది. అమెజాన్ పే యాప్ ద్వారా రైలు టిక్కెట్లు బుక్ చేసుకుంటే 10 శాతం నగదు రాయితీ లభిస్తుంది. అదే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అయితే 12 శాతం వరకు రాయితీ లభిస్తుంది. కాగా రైల్వే అధికారులు ఈ-కామర్స్ కంపెనీలతో సరుకు రవాణాకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. త్వరలోనే ప్లిప్ కార్ట్ కంపెనీ దక్షిణ మధ్య రైల్వేతో ఒప్పందం కుదుర్చుకోనుంది.