ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అమిత్ షా
కేంద్రహోం మంత్రి అమిత్ షా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడిన అమిత్ షా ఇటీవల కోలుకున్నారు.;
కేంద్రహోం మంత్రి అమిత్ షా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడిన అమిత్ షా ఇటీవల కోలుకున్నారు. అయినా.. అనారోగ్య సమస్యలతో ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. అయితే, ఆయన ఆరోగ్య సమస్య పూర్తిగా నయమవ్వడంతో సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఆయన దేశ ప్రజలకు ఈ రోజు ట్విట్టర్ వేదికగా ఓనం శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఆగస్టు 2న అమిత్ షా కరోనా బారినపడి ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆగస్టు 14న కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఇంటికి చేరిన ఆయన ఒళ్లు నొప్పులు, నీరసం తగ్గకపోవడంతో ఆగస్టు 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.