Conjoined Twins : హ్యాట్సాఫ్... అతుక్కుని పుట్టినా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు
Conjoined Twins : మనిషి సంకల్పం గొప్పదైతే సాధించకపోవడం అంటూ ఏది ఉండదు.. దీనికి ఉదాహరణ వీరిద్దరే... వీరి పేర్లు సోహ్నా, మోహనా..;
Conjoined Twins : మనిషి సంకల్పం గొప్పదైతే సాధించకపోవడం అంటూ ఏది ఉండదు.. దీనికి ఉదాహరణ వీరిద్దరే... వీరి పేర్లు సోహ్నా, మోహనా.. పంజాబ్ లోని అమృత్ సర్ కి చెందినవారు.. అవిభక్త కవలలు... జూన్ 14, 2003న జన్మించారు. వీరికి రెండు హృదయాలు, చేతులు, మూత్రపిండాలు, వెన్నుపాములతో జన్మించారు.
కానీ వీరికి ఒకటే కాలేయం, పిత్తాశయం, కాళ్లు ఉన్నాయి. వీరిని వేరు చేస్తే ప్రాణాంతకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు పరీక్షించి నిర్ణయించారు. ఇలా పుట్టిన పిల్లలను దగ్గరుండి చూసుకోవాల్సిన తల్లిదండ్రులు కూడా వారిని ఆసుపత్రిలోనే వదిలేశారు.
అయితే పంజాబ్‌లోని ఆలిండియా పింగల్వారా ఛారిటబుల్ సొసైటీ దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసింది. వారి శారీరక లోపాన్ని అధిగమించి కష్టపడి చదువుకున్నారు. వారు పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్‌పీసీఎల్)లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు.
ఈ మేరకు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అవకాశం ఇచ్చిన పంజాబ్ ప్రభుత్వానికి తమ విద్యనందించిన పింగల్వార్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు.