Viral Video: మాస్టారికి బదిలీ.. విద్యార్థుల కన్నీళ్లు..
Viral Video: విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ ఆకట్టుకునేలా బోధించే ఉపాధ్యాయులు కొందరు ఉంటారు. ఆ మాస్టారన్నా, ఆయన బోధించే విధానం అన్నా విద్యార్థులకు చాలా ఇష్టంగా ఉంటుంది.;
Viral Video: విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ ఆకట్టుకునేలా బోధించే ఉపాధ్యాయులు కొందరు ఉంటారు. ఆ మాస్టారన్నా, ఆయన బోధించే విధానం అన్నా విద్యార్థులకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఓ ఉపాధ్యాయుడిలా కాకుండా ఓ స్నేహితుడిలా విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు అరుదుగా ఉంటారు. అక్కడక్కడా తారస పడే అలాంటి ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఉత్తరప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలైన చందౌలీలోని రాయగఢ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్ధుల హాజరు తక్కువగా ఉండేది. 2018లో అసిస్టెంట్ టీచర్‌గా శివేంద్ర సింగ్ ఆ పాఠశాలకు పోస్ట్ చేయబడ్డారు. అతడు విద్యార్థులకు చదువు పట్ల అవగాహన పెంచడం, ఆటల్లో ప్రోత్సహించడం వంటివి చేస్తూ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచారు. దాంతో విద్యార్థులకు శివేంద్ర సింగ్ సార్ అంటే ప్రత్యేక అభిమానం.
నాలుగేళ్ల తరువాత అతడికి బదిలీ అయింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు సార్‌ని వెళ్లొద్దంటూ వేడుకున్నారు. అతడిని పట్టుకుని విలపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో విద్యార్థులు అతన్ని వెళ్లనివ్వకుండా గట్టిగా పట్టుకుని ఏడుస్తున్న దృశ్యాలు కనిపించాయి. శివేంద్ర విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అతడికి కూడా విద్యార్థులను వదిలి వెళుతున్నందుకు బాధగానే ఉంది. అయినా వెళ్లక తప్పని పరిస్థితి. "నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను.. మీరు కష్టపడి చదువుకోవాలి.. బాగా రాణించాలి అని విద్యార్ధుల దగ్గర సెలవు తీసుకున్నారు శివేంద్ర.
అధికారుల నుంచి కూడా శివేంద్రకు ప్రశంసలు దక్కాయి. మంచి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్న శివేంద్ర.. విద్యార్థులకు ఆసక్తికరంగా బోధిస్తారని తెలిపారు. "మేము కొండలలో క్రికెట్ ఆడేవాళ్ళం. వారికి ప్రపంచం గురించి తెలియజేసేందుకు నేను అన్ని విధాలుగా ప్రయత్నించేవాడిని. ఈ పిల్లలను విడిచిపెట్టి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది. కానీ వెళ్లాలి అని సింగ్ తెలిపారు.
Video: At UP Teacher's Farewell, Students Weep, Refuse To Let Him Go https://t.co/H9vCNQK0aj pic.twitter.com/7o0dqECKe5
— NDTV (@ndtv) July 15, 2022