MESSI: మెస్సీ నామస్మరణతో మార్మోగిన హైదరాబాద్

ఉర్రూతలూగించిన మెస్సీ మ్యాచ్... మెస్సీ జట్టుపై రేవంత్ టీమ్ విజయం... మెస్సీ నామస్మరణతో ఊగిపోయిన ఉప్పల్

Update: 2025-12-14 02:15 GMT

హై­ద­రా­బా­ద్‌­లో ఫు­ట్‌­బా­ల్‌ కి­క్‌ అది­రిం­ది. మె­స్సి పర్య­టన యా­వ­త్‌ దే­శా­న్ని ఆనం­దం­లో ముం­చె­త్తిం­ది. శని­వా­రం రా­త్రి ఉప్ప­ల్‌ స్టే­డి­యం­లో దా­దా­పు గం­ట­పా­టు ఉన్న మె­స్సి­ని చూసి అభి­మా­ను­లు కే­రిం­త­లు కొ­ట్టా­రు. ము­ఖ్య­మం­త్రి సైతం ఆనం­దం­తో మె­స్సి.. మె­స్సి.. అంటూ సం­ద­డి చే­శా­రు. రా­త్రి 7.55 గం­ట­ల­కు ప్రా­రం­భ­మైన మె­స్సి మే­ని­యా 8.52 గంటల వరకూ కొ­న­సా­గిం­ది. రా­త్రి 7.42 గం­ట­ల­కు సీఎం రే­వం­త్, రా­హు­ల్‌ గాం­ధీ స్టే­డి­యా­ని­కి వచ్చా­రు. ఆ తర్వాత సిం­గ­రే­ణి ఆర్‌­ఆ­ర్‌-9 జట్టు­తో అప­ర్ణ మె­స్సి ఆల్‌ స్టా­ర్స్‌ ఎగ్జి­బి­ష­న్‌ మ్యా­చ్‌ ప్రా­రం­భ­మైం­ది. సిం­గ­రే­ణి జట్టు ఎరు­పు, తె­లు­పు రంగు దు­స్తు­లు ధరిం­చ­గా... మె­స్సి స్టా­ర్స్‌ బృం­దం అర్జెం­టీ­నా జె­ర్సీ (నీలి, తె­లు­పు) రంగు దు­స్తు­ల­ను వే­సు­కుం­ది. కా­సే­ప­టి­కే సిం­గ­రే­ణి ఆట­గా­డు గో­ల్‌ కొ­ట్ట­డం­తో స్టే­డి­యం హో­రె­త్తిం­ది. ఆ కా­సే­ప­టి­కే 7.55 గం­ట­ల­కు స్టే­డి­యం­లో­కి మె­స్సి ప్ర­వే­శిం­చ­డం­తో అభి­మా­నుల ఆనం­దా­ని­కి అవ­ధు­ల్లే­కుం­డా పో­యా­యి. డ్రె­స్సిం­గ్‌ రూ­మ్‌­లో మె­స్సి, రో­డ్రి­గో, సు­వా­రె­జ్‌ ని­ల­బ­డి మ్యా­చ్‌­ను వీ­క్షి­స్తుం­డ­గా.. 8 గం­ట­ల­కు మరో గో­ల్‌ సా­ధిం­చిన సిం­గ­రే­ణి ఆర్‌­ఆ­ర్‌ జట్టు చి­వ­రి­కి 4-0తో అప­ర్ణ మె­స్సి బృం­దం­పై వి­జ­యం సా­ధిం­చిం­ది. 8.07 గం­ట­ల­కు రే­వం­త్‌­రె­డ్డి ఎరు­పు, తె­లు­పు రంగు జె­ర్సీ వే­సు­కు­ని మై­దా­నం­లో అడు­గు­పె­ట్ట­గా... అభి­మా­ను­లు కే­రిం­త­ల­తో స్వా­గ­తం పలి­కా­రు. మై­దా­నం­లో­కి వస్తూ­నే వా­ర్మ­ప్‌ చే­సిన రే­వం­త్‌.. ప్రొ­ఫె­ష­న­ల్‌ ఫు­ట్‌­బా­ల్‌ ఆట­గా­డి­ని తల­పిం­చా­రు.

మై­దా­నం­లో అడు­గు­పె­ట్టిన మూడు ని­మి­షా­ల­కే రే­వం­త్‌ గో­ల్‌ రా­బ­ట్ట­డం­తో స్టే­డి­యం­లో ఉత్సా­హం అం­బ­రా­న్నం­టిం­ది. మై­దా­నం­లో రే­వం­త్‌ ఆడు­తోం­టే.. వే­ది­క­పై నుం­చి రా­హు­ల్‌ గాం­ధీ­తో పాటు ప్రి­యాం­కా గాం­ధీ పి­ల్ల­లు, మె­స్సి, రో­డ్రి­గో, సు­వా­రె­జ్‌ వీ­క్షిం­చా­రు. 8.11 గం­ట­ల­కు మె­స్సి మై­దా­నం­లో అడు­గు­పె­ట్టా­డు. అప్ప­టి­వ­ర­కు ఎల్‌­ఈ­డీ స్క్రీ­న్‌ మీదే కని­పిం­చిన ఆయన... ఒక్క­సా­రి­గా కళ్ల ముం­దు­కు రా­వ­డం­తో ప్రే­క్ష­కు­లు ఉత్సా­హం­తో ఊగి­పో­యా­రు. ప్ర­తి ఒక్క­రూ ము­ని­వే­ళ్ల­పై ని­ల్చొ­ని ది­గ్గజ ఫు­ట్‌­బా­ల­ర్‌­ను తని­వి­తీ­రా చూ­సు­కు­న్నా­రు. ఆ తర్వాత అసలు ఆట మొ­ద­లైం­ది. రెం­డు జట్ల ఆట­గా­ళ్ల­తో కర­చా­ల­నం చే­సిన మె­స్సి.. రే­వం­త్‌­తో కలి­సి ఆట మొ­ద­లు­పె­ట్టా­డు. రే­వం­త్‌­కు నే­రు­గా పా­స్‌­లు అం­ది­స్తూ సం­ద­డి చే­శా­డు. రెం­డు­సా­ర్లు గో­ల్‌ పో­స్ట్‌­లో­కి బం­తి­ని తర­లిం­చా­డు. రే­వం­త్, మె­స్సి, రో­డ్రి­గో, సు­వా­రె­జ్‌ కొ­ద్ది­సే­పు పా­స్‌­లు ఇచ్చు­కుం­టూ సర­దా­గా గడి­పా­రు. మె­స్సి, రో­డ్రి­గో ఫు­ట్‌­బా­ల్‌­ల­ను గ్యా­ల­రీ­ల్లో­కి పం­పి­స్తూ ప్రే­క్ష­కు­ల్లో ఉత్సా­హం నిం­పా­రు. అనం­త­రం ని­ర్వ­హిం­చిన పె­నా­ల్టీ షూ­టౌ­ట్‌­లో రెం­డు జట్లు రెం­డే­సి గో­ల్స్‌ చే­శా­యి. సీఎం రే­వం­త్‌­రె­డ్డి సైతం పె­నా­ల్టీ షూ­టౌ­ట్‌­లో పా­ల్గొ­న్నా­రు. బం­తి­ని గో­ల్‌ పో­స్ట్‌­లో­కి పం­ప­డం­తో ఆయ­న­ను మె­స్సి సహా ఫు­ట్‌­బా­ల్‌ ఆట­గా­ళ్లం­తా అభి­నం­దిం­చా­రు.

Tags:    

Similar News