Bhasha Sangam: దేశంలోని 22 భాషలు.. నేర్చుకోండిలా.. !!
Bhasha Sangam: ఇది 22 భారతీయ భాషల్లో ప్రాథమిక సంభాషణను నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది.
Bhasha Sangam: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల భాషలు.. 22 భాషల్లో 100+ కంటే ఎక్కువ వాక్యాలను బోధించగల మొబైల్ యాప్ 'భాషా సంగం'ను ప్రారంభించినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్ ప్రకటించారు. షెడ్యూల్ చేయబడిన భారతీయ భాషలలో రోజువారీ సంభాషణకు ఉపయోగించే పదాలు ఇందులో పొందుపరచబడ్డాయి. సాధారణ వ్యక్తీకరణలతో వినియోగదారులకు అవగాహన కల్పించడానికి మొబైల్ యాప్ అభివృద్ధి చేయబడింది.
యాప్‌లో 100కు పైగా వాక్యాలను రూపొందించారు. ఇది 22 భారతీయ భాషల్లో ప్రాథమిక సంభాషణను నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. మనకు ఎంత వరకు ఆ భాషపై పట్టు వచ్చింది తెలుసుకునేందుకు వీలుగా డైలీ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. అలాగే కోర్సు పూర్తి చేసిన వారికి ఆన్‌లైన్ సర్టిఫికేట్‌లను కూడా జారీ చేస్తారు.