పిండి మిల్లు యజమాని కుమార్తె ఇంటర్మీడియట్ పరీక్షల్లో స్టేట్ సెకండ్ టాపర్ గా నిలిచింది. బీహర్ గయా జిల్లాలోని ఓల్డ్ కరీంగంజ్ కు చెందిన కోమల్ కుమారి 474/500 మార్కులు సాధించి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ ఫలితాలను బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. కోమల్ కుమారి గయాలోని మీర్జా గాలిబ్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE) విద్యార్థి. మొదటి నుంచి కోమల్ చదువులో మెరుగ్గా ఉండేది. అంతేకాదు 10వ తరగతి బోర్డు పరీక్షలో స్కూల్ టాపర్‌గా నిలిచింది. కోమల్ తన విజయాన్ని తన తల్లిదండ్రులకు, కళాశాల ఉపాధ్యాయులకు అంకితమిచ్చింది. మరో విశేషమేమిటంటే, ఇతర టాపర్‌లు ఐఏఎస్, ఐపీఎస్ కావాలని కోరుకుంటుండగా, కోమల్ మాత్రం టీచర్‌గా మారి సమాజానికి సేవ చేయాలని కోరుకుంది.
కోమల్ కుటుంబ నేపథ్యం
కోమల్ కుమారి తండ్రి అశోక్ కుమార్ పిండి మిల్లు నడిపిస్తూ, కుండలను అమ్మడం ద్వారా జీవనోపాధి పొందుతుండగా, అతని తల్లి గృహిణి. పేదరికంలో కూడా ఆడపిల్లని సమాజానికి సేవ చేసేలా చదివించారని అశోక్ కుమార్ ను పలువురు అభినందించారు. కోమల్ రాత్రి, పగలు అనే తేడాలేకుండా చదువుకునేదని తండ్రి తెలిపారు.