బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి అందరిని షాక్ కు గురిచేశారు. బీహార్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని భావోద్వేగానికి గురయ్యారు. ఏది ఏమైనా ప్రజలకు అంతిమంగా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. నితీష్ ప్రకటన పార్టీ నేతల్లో కలవరం రేపడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.