చేతిలో పెన్ను, పేపర్ పట్టుకుని మృత్యు ఒడికి.. !
పరీక్ష రాయకపోతే ఈ ఏడాది వేస్ట్ అవుతుందని నచ్చచెప్పి పాఠశాలకు వెళ్లిన రోహిత్ కుమార్.. పదో తరగతి పరీక్షలు రాస్తున్న టైంలో మృతి చెందాడు.;
జ్వరం అని తెలిసి కూడా ఓ విద్యార్థి పరీక్ష రాయడానికి వెళ్లాడు. తల్లి ఎంత వద్దని చెప్పినా వినలేదు.. పరీక్ష రాయకపోతే ఈ ఏడాది వేస్ట్ అవుతుందని నచ్చచెప్పి పాఠశాలకు వెళ్లిన రోహిత్ కుమార్.. పదో తరగతి పరీక్షలు రాస్తున్న టైంలో మృతి చెందాడు. చేతిలో పెన్ను, పేపర్ పట్టుకుని మృత్యు ఒడికి చేరాడు. బిహార్‌లోని నలంద జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. పరీక్ష రాసే ముందు అతడి ఉష్ణోగ్రత పరీక్షించగా అధికంగా ఉండడంతో.. పరీక్ష రాయడానికి పాఠశాల అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ వారిని రోహిత్ కుమార్ బతిమిలాడాడు. దీంతో అధికారులు అందుకు అంగీకరించి ఒక్కడే బయట పరీక్ష రాయడానికి అనుమతించారు. అయితే పరీక్ష రాస్తున్న సమయంలో అతని ఆరోగ్యం విషమించడంతో.. రోహిత్ కుమార్ అక్కడే మృతిచెందాడు. కాగా రోహిత్ కుమార్ షరీఫ్ అనే పట్టణంలోని ఆదర్శ్ ZP స్కూల్లో టెన్త్ చదువుతున్నాడు. విద్యార్ధి మరణంతో ఆ పాఠశాలలో విషాదం ఏర్పడింది.
Also Read:
ఘట్‌కేసర్ ఫార్మసీ అమ్మాయి సూసైడ్ కేసులో ట్విస్ట్..!
తాతా.. నీ కష్టం వృధాగా పోలేదు..!
ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. గడువు ముగిసే నాటికి రెట్టింపు నగదు మీ చేతికి