Bipin Rawat: ల్యాండింగ్‌కు కాసేపటికి ముందే ప్రమాదం.. మరో అయిదు నిమిషాల్లో గమ్య స్థానానికి..
Bipin Rawat: హెలికాప్టర్ మరికాసేపట్లో ల్యాండ్ అవుతుంది అనగా క్రాష్ అయిందని అధికారులు అంటున్నారు.;
Bipin Rawat (tv5news.in)
Bipin Rawat: తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు మరణించారు. ముందుగా టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదం జరిగిందని సమాచారం అందినా.. అది నిజం కాదని హెలికాప్టర్ మరికాసేపట్లో ల్యాండ్ అవుతుంది అనగా క్రాష్ అయిందని అధికారులు అంటున్నారు.
ఇప్పటికే ఈ హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలు ఏంటి అని ఎయిర్‌ఫోర్స్ విచారణ చేపట్టింది. బుధవారం తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో బిపిన్ రావత్‌తో పాటు ఆయన సహచరులు పాల్గొన్నాల్సి ఉంది. అక్కడికి వెళ్తుండగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి బిపిన్ రావత్.. ఆయన భార్యను కూడా తీసుకెళ్లారు.
సూలూరు నుంచి హెలికాప్టర్ బయలుదేరింది. కాసేపటికి వరకు అంతా మామూలుగానే ఉన్నా దాదాపు 12.22 సమయంలో హెలికాప్టర్‌కు బేస్ స్టేషన్‌తో సంబంధాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత కాసేపటికే అంటే 12.27కే హెలికాప్టర్ క్రాష్ అయినట్టు సాక్షులు చెప్తున్నారు. డెస్టినేషన్‌కు కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది.