Bipin Rawat: బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ ఏం చేసేవారంటే..
Bipin Rawat: బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు.;
Bipin Rawat (tv5news.in)
Bipin Rawat: ఈ దేశం మరో మంచి సైనికుడిని కోల్పోయింది. బిపిన్ రావత్.. ఆయన 42 ఏళ్ల ఆర్మీ జీవితంలో ఎన్నో చూశారు. ఎన్నో పోరాటలను ముందుండి నడిపించారు. కానీ ఇటీవల జరిగిన హెలికాప్టర్ క్రాష్‌లో కన్నుమూశారు. ఆయనతో పాటు ఆయన భార్య మధులిక రావత్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు.
ఎప్పుడూ బిపిన్ రావత్ పక్కనే ఉండే మధులిక మరణంలో కూడా ఆయనతోనే ఉన్నారు. ఆర్మీ వారి జీవితం అంత సులువైనది కాదు. అంతే కాదు ఆర్మీలో పనిచేస్తున్న వారి జీవిత భాగస్వామి జీవితం కూడా అంత సులువైనది కాదు. ఆర్మీ వారు వ్యక్తిగత జీవితానికి కేటాయించే సమయం చాలా తక్కువ. అది వారి జీవిత భాగస్వాములు అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది అని చాలామంది అనుకుంటారు. అలా బిపిన్ రావత్‌కు మధులిక రావత్ ఎప్పుడూ సపోర్టింగ్‌గా ఉన్నారు.
బిపిన్ రావత్, మధులిక రావత్‌లకు ఇద్దరు కుమార్తెలు. మధులిక రావత్ పలుమార్లు అమరవీర సైనికుల భార్యలకు అండగా నిలబడ్డారు. దేశంలోని అతిపెద్ద ఎన్జీవో ఏడబ్ల్యూడబ్ల్యూఏ(ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్)ను స్థాపించారు మధులిక. సైనికుల కుటుంబాల సంక్షమం కోసం ఈ ఎన్‌జీఓ పాటుపడుతోంది.
మధులిక రావత్.. తాను స్థాపించిన ఎన్‌జీఓ ద్వారా అమరవీరుల భార్యలకు ఆర్థికంగా అండగా ఉండడానికి సాయం చేస్తుంటారు. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు, చాక్లెట్లు, కేకుల తయారీలో ట్రైనింగ్ ఇప్పిస్తూ సొంత కాళ్ల మీద నిలబడేలా చేస్తారు. జీవితంలో బిపిన్ రావత్‌కు ఎప్పుడూ తోడుగా ఉండి, మరణంలో కూడా ఆయనతో పాటే వెళ్లిపోయారు మధులిక రావత్.