BIhar : బిహార్ సీఎం నితీష్ కుమార్ సభలో బాంబు దాడి
BIhar : బిహార్ సీఎం నితీష్ కుమార్ తృటిలో బాంబు దాడి నుంచి తప్పించుకున్నారు.;
BIhar : బిహార్ సీఎం నితీష్ కుమార్ తృటిలో బాంబు దాడి నుంచి తప్పించుకున్నారు. నలందలో జనసభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు నితీష్ కుమార్. జనసభ కార్యక్రమానికి సమీపంలో ఓ వ్యక్తి బాంబు విసిరాడు. నితీష్ సభకు 15 నుంచి 18 అడుగుల దూరంలో పేలుడు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తక్కువ తీవ్రత గల బాంబు కావడంతో ప్రమాదం తప్పిందన్నారు పోలీసులు.