Bridgestone India World Record: 565 టైర్లతో అతిపెద్ద లోగో

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైన అరుదైన ప్రక్రియ; కార్యక్రమంలో పాలుపంచుకున్న 300 మంది ఉద్యోగులు

Update: 2023-03-16 11:41 GMT

ప్రముఖ టైర్ల సంస్థ బ్రిడ్జ్ స్టోన్ ఇండియా ఉద్యోగులు సమిష్టి కృషితో ఓ వరల్డ్ రికార్డ్ ను నెలకొల్పారు. 565 టైర్లను ఉపయోగించి తమ సంస్థ లోగోను ఆవిష్కరించారు. అతిపెద్ద టైర్ ఇమేజ్ లోగోను రూపొందించేందుకు సుమారు 300 మంది ఉద్యోగులు సమిష్టిగా ఇందుకు కృషి చేశారు. వీరి కృషిని గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈ మేరకు గుర్తింపు పత్రాన్ని అందించింది. లోగోను రూపొందించేందుకు ఉపయోగించిన టైర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని అతిపెద్ద టైర్ లోగో కేటగిరీలో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పినట్లు ధృవీకరించారు. ఈ మేరకు బ్రిడ్జ్ స్టోన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్టెఫానో సచిని సంస్థ ఉద్యోగుల కృషిని కొనియాడారు. తమ బ్రాండ్ కు ఈ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ఉద్యోగుల సమన్వయ కృషిపై ప్రశంశలు కురిపించారు. వీరి వల్లే సంస్థ గ్లోబల్ మార్కెట్ లో శిఖరాగ్ర స్థానాన్ని కైవసం చేసుకుందని వెల్లడించారు. 

Tags:    

Similar News