కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం..!
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో.. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై చర్చించనున్నారు.;
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో.. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న కేబినెట్ సమావేశంలో.. దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. వ్యాక్సిన్ పంపిణీ, ఆక్సిజన్ కొరత, కరోనా కట్టడి చర్యలు.. తదితర అంశాలపై కేంద్ర కేబినెట్ చర్చించనుంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు సూచనలు వస్తున్న నేపథ్యంలో.. ఈ అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకునే ఛాన్సుంది. మరిన్ని విదేశీ వ్యాక్సిన్ల దిగుమతి, వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు ఆర్థిక తోడ్పాటు.. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచే దిశగా కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.