Central Government Employees: ఇవాల్టి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సౌకర్యాలు కట్!

Central Government Employees: ప్రభుత్వ ఉద్యోగులు అనగానే వారికి అనేక సౌకర్యాలు ఉంటాయని చాలామంది భావిస్తూ ఉంటారు.;

Update: 2021-11-08 04:45 GMT

Central Government Employees: ప్రభుత్వ ఉద్యోగులు అనగానే వారికి అనేక సౌకర్యాలు ఉంటాయని చాలామంది భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మరికొన్ని సౌకర్యాలను కల్పించింది ప్రభుత్వం. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుతుండడంతో మెల్లమెల్లగా వారికి అందించిన సౌకర్యాలన్నీ కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులు నిరర్వహించడం మొదలుపెట్టారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇవాల్టి నుండి అలాగే పనిచేయాల్సి ఉంటుంది. కోవిడ్ వల్ల ప్రైవేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించినట్టుగా ప్రభుత్వ రంగం కూడా ఉద్యోగులను దశలవారీగా మాత్రమే రమ్మని చెప్పింది. అంతే కాకుండా పనిగంటలు కూడా తగ్గించింది. ఇకపై అవేవీ ఉండవని కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్‌ కుమార్‌ భాటియా స్పష్టం చేశారు.

కరోనా కారణంగా తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేవారు, అంతే కాక పనిగంటలు కూడా తక్కువగా ఉండేవి. ఇకపై అలా ఉండబోదని ఉమేష్ కుమార్ తెలిపారు. నవంబర్ 8 నుండి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మునుపటి లాగా పనిచేయడం మాత్రమే కాకుండా కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు.

ఆ కొత్త నిబంధనలు ఏంటంటే..

ఉద్యోగులందరూ హాజరు నమోదుకు ముందు, తర్వాత చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలి.

ఉద్యోగులందరూ ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి లేదా ఫేస్ కవరింగ్ ధరించాలి.

బయోమెట్రిక్ యంత్రం దగ్గర తప్పనిసరిగా శానిటైజర్ ఉండాలి.

బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేటప్పుడు ఉద్యోగులు తమ మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలి.

బయోమెట్రిక్ మిషన్ టచ్‌ప్యాడ్‌ను తరచుగా శుభ్రం చేయడానికి సిబ్బందిని నియమించాలి.

బయోమెట్రిక్ యంత్రాలను బహిరంగ వాతావరణంలో ఉంచాలి.

యంత్రం లోపల ఉంటే, తగినంత సహజ వెంటిలేషన్ ఉండాలి.

Tags:    

Similar News