హిందూ మహాసముద్రంలో పడిన చైనా రాకెట్..!
గత వారం రోజులుగా అందర్నీ భయపెట్టిన చైనా రాకెట్ 'లాంగ్ మార్చ్ 5బీ' శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలాయి.;
గత వారం రోజులుగా అందర్నీ భయపెట్టిన చైనా రాకెట్ 'లాంగ్ మార్చ్ 5బీ' శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలాయి. కేవలం కొన్ని చిన్న చిన్న భాగాలు మాత్రమే సముద్రంలో పడ్డాయి. భూ వాతావరణంలో చేరగానే రాకెట్ శకలాలు మండిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి పచ్చిమ మాల్దీవులు సమీపంలోని సముద్రంలో నేలకూలినట్లు నిర్ధారించారు. ఏప్రిల్ 29 న ప్రయోగించిన 'లాంగ్ మార్చ్ 5బీ' అనే 22.5 టన్నుల భారీ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. అప్పటి నుంచి ఎక్కడ పడుతుందో అని అందరూ భయపడ్డారు.