బిపిన్ రావత్ భౌతికకాయానికి సీఎం స్టాలిన్ నివాళులు..!
MK Stalin : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భౌతిక కాయానికి తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై నివాళులు అర్పించారు.;
MK Stalin : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భౌతిక కాయానికి తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై నివాళులు అర్పించారు. వెల్లింగ్టన్ మద్రాస్ రెజిమెంటల్ కేంద్రంలో రావత్ సహా 13 మంది భౌతిక కాయాలు ఉంచారు. హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. లైఫ్ సపోర్ట్‌పై ఆయనకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు. అవసరమైతే వరుణ్ సింగ్‌ను బెంగళూరు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.