అయ్యో పాపం అవినాష్.. కరోనాతో మృతి చెందిన ఏడు రోజుల తర్వాత..
మృత్యువు అతడిని కరోనా రూపంలో కాటేసింది. కొడుకు విజయాన్ని ఆస్వాదించలేకపోయారు తల్లిదండ్రులు.;
భోజ్‌పూర్ జిల్లాలోని పిరో సబ్ డివిజన్‌కు చెందిన బైసాదిహ్‌లో నివసిస్తున్న విజయ్ శంకర్ ఉపాధ్యాయ కుమారుడు అవినాష్. ఇంజనీర్ పూర్తి చేసిన అతడు బిపిఎస్‌సి 65 వ మెయిన్స్‌లో విజయం సాధించారు. కానీ ఆ సంతోషాన్ని ఆస్వాదించడానికి అతడు బ్రతికి లేడు. మృత్యువు అతడిని కరోనా రూపంలో కాటేసింది. కొడుకు విజయాన్ని ఆస్వాదించలేకపోయారు తల్లిదండ్రులు. చెట్టంత కొడుకుని కోల్పోయిన దుఖంలో ఉంది కుటుంబం.
వాస్తవానికి, ఫలితం రావడానికి ఆరు రోజుల ముందు, కరోనా అవినాష్‌ను చంపింది. జూన్ 24 న అవినాష్ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. విజయ్ శంకర్‌కి ఇద్దరు కొడుకులు. చిన్నవాడు అవినాష్.. ఏప్రిల్ 24న కరోనా బారిన పడ్డాడు. అన్నయ్య అభిషేక్ ఉపాధ్యాయ రైల్వేలో సీనియర్ లోకో పైలట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
డిసెంబర్ 25, 1991 న జన్మించిన అవినాష్ చిన్నతనం నుంచీ తెలివైనవాడు. భోపాల్ టిఐటి నుండి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లో బి.టెక్ చేశాడు. ఇంజనీరింగ్ చివరి పరీక్షలో అతడు రాష్ట్రంలో రెండవ టాపర్‌గా నిలిచాడు. క్యాంపస్ ఎంపికలో అవినాష్‌కి మంచి ప్యాకేజీతో ఉద్యోగం లభించినప్పటికీ అతడికి ఆ ఉద్యోగం చేయాలని లేదు.
ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉండేవాడు. జూన్ 24 న, చికిత్స పొందుతూ వ్యాధి తీవ్రం కావడంతో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అర్రా నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అవినాష్ మరణించాడు. తన కుటుంబం ఓ సరస్వతీ పుత్రుడిని కోల్పోయిందని అవినాష్ మామ కన్నీళ్లతో చెప్పారు.