ఢిల్లీలో ఆందోళనకరంగా కరోనా మరణాలు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృభణ భయంకరంగా మారింది. ఒకానొక దశలో కరోనా ప్రభావం బాగా తగ్గి మిగాతా రాష్ట్రాలకు ఆధర్శంగా

Update: 2020-09-29 06:19 GMT

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృభణ భయంకరంగా మారింది. ఒకానొక దశలో కరోనా ప్రభావం బాగా తగ్గి మిగాతా రాష్ట్రాలకు ఆధర్శంగా నిలిచిన ఢిల్లీలో గత నెలరోజుల నుంచి భారీ సంఖ్యలో కేసుల నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా అదేస్థాయిలో నమోదువుతున్నాయి. సోమవారం కరోనాతో 37 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 5272కు చేరుకున్న‌ది. ఢిల్లీలో కరోనా మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ లో 40శాతం ఎక్కువగా మరణాలు సంభవించాయి. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన డేటా ప్ర‌కారం.. ఢిల్లీలో జూన్‌లో 2269 మంది, జూలైలో 1221 మంది వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏప్రిల్‌లో 57 మంది, మేలో 414 మంది వైర‌స్ వ‌ల్ల తుదిశ్వాస విడిచారు. ఇతర వ్యాదులు ఉన్న వారికి కరోనా సోకింతే.. అలాంటి వారు మృత్యువాతపడుతున్నారని లోక్ నాయ‌క్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ ఒక‌రు తెలిపారు. 

Similar News