Maharastra Lockdown : మహారాష్ట్రలో జూన్ 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కరోనా కేసులు, మరణాలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

Update: 2021-05-13 07:25 GMT

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కరోనా కేసులు, మరణాలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి.. కేసులు భారీగా నమోదవుతున్న నేపధ్యంలో జూన్ 1 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. RTPCR టెస్ట్ ఉన్నవారికి మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఉంటుందని పేర్కొంది. కరోనా కట్టడికి గాను కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో బుధవారం కొత్తగా 46,781 కరోనా కేసులు నమోదు కాగా, 816 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,26,710కు చేరుకుంది. అటు మరణాల సంఖ్య 78,007 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,46,129 యాక్టివ్ కేసులున్నాయి. 

Tags:    

Similar News