జార్ఖండ్ మాజీ సీఎంకు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు ఇటీవల ఎక్కువగా;
దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు ఇటీవల ఎక్కువగా కరోనాకు గురి అవుతున్నారు. తాజాగా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీకి కరోనా సోకిందని వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలు కనపించడంతో శుక్రవారం కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలిదని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. సెల్ప్ క్వారంటైన్ లో ఉన్నానని.. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తలు పాటించాలని కోరారు. వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. త్వరలోనే కోలుకుని ప్రజాసేవలో పునరంకితుడనవుతానని ఆకాంక్షించారు.