భారత్‌లో కరోనా విలయతాండవం.. కొత్తగా 94,372 కేసులు
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతుంది. ఇటీవల వరుసగా 90వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.;
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతుంది. ఇటీవల వరుసగా 90వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 94,372 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 47,54,357కి చేరింది. ఇందులో ఇప్పటివరకు 37,02,595 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 9,73,175 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఇప్పటివరకూ కరోనాతో 78,586 మంది చనిపోయారు.