దేశంలో మళ్లీ పెరిగిన కరోనా .. 80 వేలకు పైగా కొత్త కేసులు..
దేశంలో కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతున్నాయి. ఒకే రోజు ఎనబై వేలకు పైగా కేసులు బయటపడగా.. ఒక్కరోజు మాత్రం 70 వేలకు;
దేశంలో కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతున్నాయి. ఒక్కో రోజు ఎనబై వేలకు పైగా కేసులు బయటపడగా.. ఒక్కోసారి మాత్రం 70 వేలకు పరిమితం అవుతున్నాయి. నిన్న దాదాపు 70 వేల మందికి పైగా కరోనా బారినపడగా.. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 80,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య సంఖ్య 62,25,764కు చేరింది. అయితే, ఇందులో 51,87,826 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 9,40,441 మంది చికిత్స పొందుతున్నారు. అటు, గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు కూడా నిన్నటి కంటే ఎక్కువగానే నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 1179 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 97,497కు చేరింది.