Coronavirus In India : దేశ జనాభాలో 1.8శాతం మందికి కరోనా : కేంద్రం

Coronavirus In India : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా మరణాల రేటు 1.1 శాతంగా ఉందని వెల్లడించింది

Update: 2021-05-18 15:41 GMT

Coronavirus In India : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా మరణాల రేటు 1.1 శాతంగా ఉందని.. దేశ జనాభాలో 1.8% మంది కరోనా బారిన పడ్డారని వెల్లడించింది. 8 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు, 10 రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష వరకు, 18 రాష్ట్రాల్లో 50వేలలోపు యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. అటు కరోనా నియంత్రణలో వ్యాక్సినేషన్ ముఖ్య ప్రక్రియ ముఖ్యమని తెలిపింది. ప్రస్తుతం దేశంలో కొత్త కేసుల క‌న్నా రిక‌వ‌రీ కేసులే ఎక్కువ‌గా ఉన్నాయంది. కాగా దేశంలోనే తొలిసారిగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 4,22,436 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 33,53,765 యాక్టివ్ కేసులున్నాయి.  

Tags:    

Similar News