కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ షురూ..
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 18 ఏళ్లు దాటిన వారందరూ టీకా వేయించుకునేందుకు రిజిస్టర్ చేసుకోవచ్చు.;
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 18 ఏళ్లు దాటిన వారందరూ టీకా వేయించుకునేందుకు రిజిస్టర్ చేసుకోవచ్చు. www.cowin.gov.in అనే పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. రిజిస్టర్ చేసుకున్న వాళ్లకు మాత్రమే మే 1 నుంచి వ్యాక్సిన్ ఇస్తారు. మే 1 నాటికి వ్యాక్సిన్ సెంటర్ల ఆధారంగా అపాయింట్ మెంట్ ఖరారవుతుంది.
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఇలా..
* కొవిన్ వెబ్ సైటు/ఆరోగ్యసేతు యా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
* మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది. ఆ తర్వాత పేరు, పుట్టినతేదీ వివరాలను నమోదు చేయాలి
* ఆ తర్వాత వ్యాక్సినేషన్ కేంద్రం ఎంచుకోవాలి
* పిన్ కోడ్ నొక్కితే.. వ్యాక్సిన్ కేంద్రాల వివరాలు వస్తాయి
* సెంటర్‌ను ఎంచుకున్న తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి
* అన్ని పూరైతే మీ ఫోన్ కు మెసేజ్ వస్తుంది