ఢిల్లీలో కరోనా విజృంభణ.. కొత్తగా 3,816 కేసులు
ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రతీరోజూ మూడువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.;
ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రతీరోజూ మూడువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,816 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదైన కేసులతో ఢిల్లీలో కరోనా బాధితులు సంఖ్య 2,53,075కు చేరింది. ఇప్పటివరకూ 2,16,401 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా, 31,623 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. కొత్తగా 37 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకూ 5,051 ఈ మహమ్మారి కాటుకి మరణించారు. కాగా కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం.. ప్రైవేట్ ఆస్పత్రిల్లో ఐసీయూలో 80శాతం బెడ్లు కరోనా రోగుల కోసం కేటాయించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీ హైకోర్టు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది.