Tamil Nadu : తమిళనాడులో పదేళ్ల తరువాత అధికారంలోకి డీఎంకే
తమిళనాడులో పదేళ్ల తరువాత అధికారంలోకి రాబోతోంది డీఎంకే. కరుణానిధి వారసుడిగా స్టాలిన్ ముఖ్యమంత్రి పగ్గాలు చేజిక్కించుకోబోతున్నారు.;
తమిళనాడులో పదేళ్ల తరువాత అధికారంలోకి రాబోతోంది డీఎంకే. కరుణానిధి వారసుడిగా స్టాలిన్ ముఖ్యమంత్రి పగ్గాలు చేజిక్కించుకోబోతున్నారు. అయితే, సర్వేలు చెప్పినట్టుగా డీఎంకేకు ఏకపక్ష ఫలితాలు కనిపించడం లేదు. అన్నాడీఎంకే బాగానే పోరాడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. కాని, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి అన్నాడీఎంకే పర్ఫామెన్స్ చూపిస్తోంది. అధికారంలోకి రాలేకపోతున్నప్పటికీ.. చెప్పుకోదగ్గ సంఖ్యను అసెంబ్లీలో దింపబోతోంది అన్నాడీఎంకే. డీఎంకే కూటమి 136 స్థానాల్లో, అన్నాడీఎంకే 92 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.