Sputnik V: పంపిణీ షురూ..ధర ఎంతో తెలుసా?
భారత్ లో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకాను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్ .. దినీ ధరను ప్రకటించింది. ఒక్కో డోసు ధర రూ. 948గా నిర్ణయించింది.
భారత్ లో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకాను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్ .. దినీ ధరను ప్రకటించింది. ఒక్కో డోసు ధర రూ. 948గా నిర్ణయించింది. దీనికి 5 శాతం GSTతో కలిపి రూ. 995.40గా ఉంటుంది. భారత్ లో ఉత్పత్తి, పంపిణీకి RDIFతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ సహకారంతో గమలేయా అభివృద్ధి చేసిన ఈ స్పుత్నిక్ వీ టీకా వినియోగానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. రష్యా నుంచి కొన్ని డోసులు ఇప్పటికే హైదరాబాదు కి చేరుకోగా వీటి పంపిణీకి సెంట్రల్ డ్రగ్స్ లాబోరేటరీ నుంచి మే 13న అనుమతి వచ్చిందని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.