కట్టుకుంటే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి! అంతా ప్రకృతి హితమే
Eco-Friendly House: మహారాష్ట్ర కొల్హాపూర్‌కు చెందిన రాహుల్ వి. దేశ్‌పాండే తన ఇంటిని అద్భుతంగా నిర్మించారు.;
Eco-Friendly House
Eco-Friendly House: ప్రస్తుత కాలంలో ఇంటి నిర్మాణం ఖర్చుతో కూడుకున్నది. విలాసవంతమైన భవనాలు సామాన్యులకు అందని కలే. సిమెంట్, ఇసుక, ఇటుక, మేస్త్రీ ఖర్చులు ఇలా అన్ని ఖర్చులు భరించడం కష్టమే. అందుకే ఇంటిని నిర్మించాలంటే సామాన్యులు వెనకడుగు వేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి తన ఇంటిని వినూత్న రీతీలో నిర్మించాడు. ప్రకృతి అనుకూలమైన ఉత్పత్తులను ఉపయోగించి ప్రణాళికాబద్ధంగా తన గృహ నిర్మాణం చేశాడు. ఆ ఇల్లు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో ఈ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
మహారాష్ట్ర కొల్హాపూర్‌కు చెందిన రాహుల్ వి. దేశ్‌పాండే (పర్యావరణ ఆధ్యాత్మికవేత్త, రూరల్ రీకన్సట్రక్టర్) తన ఇంటిని అద్భుతంగా నిర్మించారు. రాహుల్ పట్టణ ప్రాంతంలోనే తన ఇంటిని నిర్మించారు, ఆధునికతను సాంప్రదాయంతో మిళితం చేశారు. రెండంతస్థుల నిర్మాణంలో మట్టితో మోర్టార్ (ఫిరంగి), ప్లాస్టర్‌ని ఉపయోగించి ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ ఇల్లు ప్రకృతికి అనుగుణంగా, పర్యావరణ హింతంగా ఉంటుంది. ఈ ఇంటిని మట్టితో నిర్మించడంతో సాధారణ ఇంటితో పోల్చితే ఖర్చు 50 శాతంకంటే తక్కువే. ఈ ఇంటిని మీరు ఒక సారి చూడండి.
ఇల్లు గురించి ఆసక్తికర విశేషాలు:
*మట్టితో ఫ్లోరింగ్
*మట్టితో నిర్మించిన పైకప్పు పలకలు
*కూరగాయలను తాజాగా ఉంచడానికి మట్టి రిఫ్రిజిరేటర్
*వర్షపు నీటి సేకరణ విధానం
*బయోగ్యాస్‌గా ఉపయోగించే రీసైకిల్ సేంద్రీయ వ్యర్థాలు
*కూల్చివేసిన భవనాల నుండి పదార్థాల పునర్వినియోగం
*నిర్మాణ వ్యయం 50% వరకు తగ్గించబడింది