Param Bir Singh: వివాదాల్లో ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్.. ఉగ్రవాది కసబ్ ఫోన్‌ను..
Param Bir Singh: వసూళ్ల కేసులు ఎదుర్కొంటున్న ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్‌పై.. మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి.;
Param Bir Singh (tv5news.in)
Param Bir Singh: బలవంతపు వసూళ్ల కేసులు ఎదుర్కొంటున్న ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్‌పై.. మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి. 13ఏళ్ల క్రితం ముంబయిపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాది అజ్మల్ కసబ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను.. పరంబీర్ సింగ్ ధ్వంసం చేశారని రిటైర్డ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సంషేర్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముంబై దాడుల తర్వాత కసబ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను అప్పటి సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.ఆర్ మాలి.. కానిస్టేబుల్ కాంబ్లీకి ఇచ్చారన్నారు సంషేర్. దాడి సమయంలో టెర్రరిస్టు నిరోధక దళ డీఐజీగా ఉన్న పరంబీర్ ఆ ఫోన్‌ను కానిస్టేబుల్ నుంచి తీసుకున్నారని.. అయితే దాన్ని దర్యాప్తు అధికారి రమేశ్ మహాలేకు ఇవ్వకుండా పరంబీర్ ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఏడాది జులైలో సంషేర్ ఈ ఫిర్యాదు చేయగా.. గురువారం అకస్మాత్తుగా ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.