Tamil Nadu: దీపావళి నాడు విషాదం.. తండ్రీకొడుకులు టపాసులు తీసుకువెళ్తుండగా..

Tamil Nadu: దీపావళి అంటే దీపాల పండుగ. దానిని టపాసుల పేరుతో పొల్యూట్ చేయకూడదు అంటుంటారు కొందరు.

Update: 2021-11-05 09:04 GMT

Tamil Nadu (tv5news.in)

Tamil Nadu: దీపావళి అంటే దీపాల పండుగ. దానిని టపాసుల పేరుతో పొల్యూట్ చేయకూడదు అంటుంటారు కొందరు. కానీ మరికొందరు మాత్రం సంవత్సరమంతా పొల్యూషన్ గురించి ఆలోచించకుండా దీపావళికి మాత్రమే పొల్యూషన్ గుర్తొస్తుందా అని వాదిస్తుంటారు. సరదాగా కాల్చే ఈ టపాసుల వెనుక చాలా రిస్క్ ఉంటుంది. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా కాల్చాలని సూచిస్తూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వీటి వల్ల జరిగే ప్రమాదాలు మాత్రం తగ్గట్లేదు. తాజాగా తండ్రి, కొడుకులు టపాసుల వల్లే ప్రాణాలు విడిచారు.

తమిళనాడు విల్లుపురం జిల్లాలో బాణాసంచా పేలుడు ఇద్దరిని బలితీసుకుంది. రెండు బ్యాగుల నిండా టపాసులు కొనుక్కుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. పేలుడు జరిగి తండ్రి కలైనేసన్, కొడుకు ప్రదీష్(7) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఐతే.. పేలుడు తీవ్రతను బట్టి తీసుకెళ్తున్నవి టపాసులా.. లేక నాటుబాంబులా అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Tags:    

Similar News