Income Tax : ఆదాయపన్ను మినహాయింపులపై ఈసారి కూడా నిరాశే!
Income Tax : ఆదాయపన్ను మినహాయింపులపై ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ఐటీ శ్లాబ్స్‌లో మార్పులు చేస్తారని వేతన జీవులు ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు.;
Income Tax : ఆదాయపన్ను మినహాయింపులపై ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ఐటీ శ్లాబ్స్‌లో మార్పులు చేస్తారని వేతన జీవులు ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు అందించారు. అంటే రిటర్న్‌లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు. ఇక సహకార సంఘాలపై సర్‌ఛార్జీని తగ్గించనున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ డిడక్షన్ ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్‌పీఎస్ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పించారు. మరోవైపు క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీ తీసుకొస్తామన్నారు.