హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా జైలు నుంచి విడుదల
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో దోషిగా పదేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న చౌతాలా తీహర్ జైలు నుంచి ఇవాళ విడుదలయ్యారు.;
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో దోషిగా పదేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న చౌతాలా తీహర్ జైలు నుంచి ఇవాళ విడుదలయ్యారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా జైలు అధికారులు 1000 మంద ఖైదీలకు పెరోల్‌పై విడుదల చేసినప్పటినుంచి బయటనే ఉన్నారు. 6 నెలల కన్నా తక్కువ శిక్ష ఉన్న ఖైదీలను ఉపశమనం చేస్తూ.. గతనెల ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలల శిక్ష మిగిలి ఉన్నందున అధికారులు చౌతాలాను విడుదల చేశారు. చౌతాలా మాదిరి ఉపశమానానికి 20 మంది ఖైదీలు అర్హత సాధించారు.